పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం, గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలి.. 

The pending honorarium and egg bills should be released immediately.– ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000/-లు ఇవ్వాలని డిమాండ్  
– డిశెంబర్ 16, 17 తేదీల్లో మధ్యాహ్న భోజన కార్మికులు వంట బంద్ పెట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన రూ.10,000/-లు వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిశెంబర్ 16, 17 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం అని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం లో గల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న గుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి. లేని ఎడల డిశెంబర్ 1 నుండి పిల్లలకు గుడ్లు పెట్టడం బంద్ పెడతాం అని తెలియజేశారు. పెరిగిన ధరలకనుగుణంగా పిల్లలికిచ్చే మెనూ చార్జీలు పెంచాలి.పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000/-ల వేతనం అమలు చేయాలి.ప్రతి స్కూల్కు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. అవసరమైన గ్యాస్ను సరఫరా చెయ్యాలి. గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి.కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి. సామాజిక భద్రత కల్పించాలి. మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదు. ప్రమాద బీమా, పిఎఫ్. ఈఎస్వి సౌకర్యం కల్పించాలి. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలి. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (పిఎఫ్ఎంఎస్) ద్వారా బిల్లులు. జీతాలు చెల్లించాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) సాయవ్వ, లింగవ్వ, నాగమణి, లక్ష్మి, లత, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.