పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి

The pending scholarship should be released– యుఎస్ఎఫ్ఐ డిమాండ్ 
– యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని భారీ ర్యాలీ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిజాంబాద్ నగరంలో దాదాపు 500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్ధల నాగరాజు పెద్ది సూరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు ఎనిమిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయని ఈ బకాయిలను విడుదల చేయాల్సిన చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం అని అన్నారు అదేవిధంగా గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని తాము అధికారంలోకి వస్తే విద్యారంగ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేసినాక విద్యారంగానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పిన మాటలు కోటలు దాటాయి కానీ ఫలితం లో కనీసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీ నుండి పీజీ స్థాయి కాలేజీ వరకు స్కాలర్షిప్ ఫీజు & రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 8 వేల కోట్లు ఉన్నాయని ఈ బకాయిలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం అనవసరపు పథకాలకు డబ్బు ఖర్చు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడి వేయడం ఎంతవరకు సమంజసమని అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అదే విధంగా నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజ్ స్థాయి నుంచి పీజీ స్థాయి కాలేజీ వరకు దాదాపు 350 కోట్ల పైనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రకంగా కృషి చేయాలని అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేస్తూ సెక్రటేరియట్ ముట్టడిని కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ మారుతి అభిషేక్  జిల్లా సహాయ కార్యదర్శులు వేణు రాజు, యుఎస్ఎఫ్ఐ నగర సహాయ కార్యదర్శిలు సంతోష్,అజయ్, నవీన్, అభిషేక్, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.