వికలాంగులకు ఇచ్చిన పెన్షన్ హామీ తక్షణమే అమలు చేయాలి

The pension guarantee given to the disabled should be implemented immediatelyనవతెలంగాణ – హలియా 

కాంగ్రెస్ ప్రభుత్వము వికలాంగులకు హామీ ఇచ్చిన ప్రకారం పెంచిన పెన్షన్లు అన్నిటిని తక్షణమే విడుదల చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య అన్నారు  నల్లగొండ జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్  అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ సదస్సులో ఆయన మాట్లాడుతూ వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళకు బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు రూ.4000 రూపాయలు పెన్షన్ వికలాంగులకు రూ.6000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్న పెన్షన్ను తక్షణమే విడుదల చేయాలని అన్నారు.ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంతవరకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది స్పష్టత ఇవ్వడం లేదు.. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిసెంబర్ 9 నుండి ఇస్తానన్న పెంచిన పెన్షన్ ఇవ్వాలని. డిమాండ్ చేశారు. అలాగే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని. మిగిలిన మూడు లక్షల మందికి పెన్షన్ వెంటనే కొత్త పెన్షన్ మంజూరు చేయాలని. ఆగస్టు 28వ తేదీ వికలాంగుల హక్కుల పోరాట దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో భారీ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీరామదాసు వెంకట చారి. రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు. మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డి. జిల్లా కో కన్వీనర్ వీరబోయిన సైదులు,రా మేశ్వరి, లక్ష్మి,వాలి,బాలకృష్ణ,బషీర్, సిద్దవలి,చిట్టి రాజుతదితరులు పాల్గొన్నారు.