దంచి కొడుతున్న ఎండలు.. తల్లడిల్లుతున్న జనాలు

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలో గత రెండు రోజులుగా ఎండ తీవ్రత దంచి కొడుతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు ఎండ వేడి తో ఎక్కడ ఉన్నా ఇంట్లో గాని చెట్ల కింద గాని వేడి గర్మి తో కూలర్లు పెట్టుకున్న జనాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి ప్రజలకు తల్లాడే విధంగా చేస్తుంది మద్నూర్ మండలంలో ఎండ తీవ్రత 45 డిగ్రీలు కొనసాగడం వేడి చివ్రత పెరగడం జనాలంతా గర్మి తో తల్లడిల్లుతున్నారు. ఎండ తీవ్రతతో జనాలు జ్వరం బారిన పడుతున్నారు. ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరలేక ప్రజలంతా అల్లాడిపోతున్నారు.