హామీలపై అధికారులను జనం నిలదీత

– సమావేశానికి సరఫరా విద్యుత్తును నిలిపిత
– లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు
నవతెలంగాణ -ఆత్మకురు
రాష్ట్రం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేస్తున్న సమావేశాలలో ప్రజలు గతంలో ఇచ్చిన హామీల గురించి అక్కడక్కడ నిలదీస్తున్నారు. ఇటీవల శనివారం ఓ గ్రామంలో జరిగిన రైతు దినోత్సవం సందర్భంగా గ్రామంలోని కాలనీ వాసులు దేవాలయ నిర్మాణ విషయంలో ఇచ్చిన హామీ అమలు నోచుకోలేదని సమావేశానికి ఆటంకం కలిగించారు .సమావేశానికి సరఫరా విద్యుత్తును నిలిపివేశారు .అదే విధంగా సమావేశం జరుగుతున్న సందర్భంలో లక్ష రూపాయల రుణమాఫీ కాలేదని ,ఇటీవల వడ్లు అమ్మకాలకు అమ్మిన డబ్బులు ఇంకా రాలేదని ప్రస్తావించారు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో అధికారులు,అధికార ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు 50,000 వరకు రుణమాఫీ అయిందని, లక్ష రూపాయల త్వరలో అవుతుందని చెప్పినా ప్రజలు వినకుండా గందరగోళం సృష్టిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు సమావేశాలలో ప్రజలు ఇదివరకు కల్పించిన, పొందుతున్న పథకాల గురించి వినడం లేదు ,ఇప్పుడు ఏమి ఇస్తారు ఏమి హామీలు ఇస్తున్నారు అనేది ప్రజలు వింటున్నారు. కావునఈ విషయం అధికార ప్రజాప్రతినిధులు గమనించాలి. వాటిపైనే దృష్టి పెట్టాలి భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి వివరించినట్లయితే ప్రజలు వినే సందర్భంలో ఉన్నారు. సమస్యలు సహజంగా ఉంటాయి వాటిని శాంతియుతంగా, సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.