– ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలి.
– భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాటారం, మల్హర్ మండలాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వీరికి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య, వరద సహాయక చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మండలాల అధికారులను ఆదేశించారు.ఆదివారం గంగారం, కొయ్యుర్, పివి నగర్,వళ్లెంకుంట గ్రామాల్లో మండల తహశీల్దార్ రవి కుమార్,ఎంపిడిఓ శ్యాంసుందర్ లతో చెరువులు,మానేరు,బొగ్గుల వాగులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరు బయటకు వెళ్లవద్దన్నారు.తాడిచెర్ల,మల్లారం,పివినగర్,కుంభంపల్లి,వళ్లెంకుంట,కొండంపేట తదితర మానేరు పరివాహక ప్రాంతాల్లో పశువుల కాపర్లు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.పాత ఇండ్లలో ఉండకూడదని,వాగులు,చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ విక్రమ్, ఇంఛార్జి అఐ గొట్టం నరేశ్,కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.