ప్రజలు మార్పు కోరుకున్నారు.. ప్రజల తీర్పును అంగీకరించాలి

– గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
– కాంగ్రెస్ కాలయాపన ప్రభుత్వం, పార్లమెంటు ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదే గొంగిడి మహేందర్ రెడ్డి
– బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం
నవతెలంగాణ -యాదగిరిగుట్ట రూరల్ 
ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజల తీర్పును అంగీకరించాలి అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి మంగళవారం, బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గెలిచిన, ఓడిన కసిగా పని చేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రసంగాలకు ఆకర్షితురాలునై,  రాష్ట్ర సాధనకోసం పని చేసి, తెలంగాణ ప్రజల కష్టాలను కేసీఆర్ చెప్పిన తీరుకు, ఆ కష్టాలు పోవాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మార్గం అని ఆయన దిశా నిర్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా బిఆర్ఎస్ పార్టీ తరపున కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిచేలా సంక్షేమ పథకాలు గడపగడపకు అందేలా పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు. బి ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ నాయకురాలుగా అనేక అవకాశాలు ఇచ్చి కిందిస్థాయి నుంచి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వరకు ప్రోత్సహించిందని, పార్టీ వెంట ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నాకు పడిన ఓట్లు పార్టీ క్యాడర్ వేసిన ఓట్లు మాత్రమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జెండా గులాబీ జెండా అని అన్నారు. భవిష్యత్తులో కెసిఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రి మనకు దొరుకుతాడని అనుకోను అని అన్నారు.  గతంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసాము ఇప్పుడు కూడా అలాగే భవిష్యత్తు తరాల కోసం బి ఆర్ ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది అని అన్నారు. డీసీసీబీ చైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 50వేల మెజారటీతో ఓడిపోవడం చాలా భాధగా ఉంది. నా పిల్లలను కూడా పట్టించు కోలేదు, ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడినం, నా జీవితం అంతా పోరాటమే, మండల, గ్రామ స్థాయి నాయకులు ప్రతి పక్ష పాత్ర పోషించాలి, కెసిఆర్ ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నారు. కార్యకర్తలు కసిగా పని చేసి పార్లమెంట్ ఎన్నికలలో సత్తచాటలి అన్నారు. పార్టీ నీ గ్రామ స్థాయి లో పటిష్టం చేయాలి అని పిలుపునిచ్చారు.  అధికార కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడితే అందరం కలిసి కట్టుగా పనిచేదాం అన్నారు. ఎంతో మంది నాయకులను తయారు చేసుకున్నాము. ఎలక్షన్స్ లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బూడిద బీక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ ఓడిపోవడం భాడకరమైన విషయం, ప్రజలే మార్పు కోరుకున్నారు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై అమలు అవుతాయా అని ప్రజలకే అనుమానం వుంది అని అన్నారు. ప్రజా పాలనలో తీసుకున్న దరకాస్తులపై అనేక అనుమానాలు ప్రజలకు వున్నాయి. ప్రజలను సమాయత్తం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకీ రాగానే డిసెంబర్ లోనే ఎకరాకు పదిహేను వేల రూపాయలు  రైతు బంధు వెస్తం అన్నారు ఎక్కడ, ఎందుకు వేయలేదు అని ప్రశ్నించారు. శ్వేత పత్రం, అప్పు అంటూ కాలయాపన చేస్తున్నారు అని అన్నారు. కార్యకర్తలు అదర్యపడోద్దు, బి ఆర్ ఎస్ జెండా పార్లమెంట్ ఎన్నకల్లో రెపరెపలాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ బీకునాయక్, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సుధగానీ హారిశంకర్ గౌడ్, జెడ్పీటసీ తోటకూరి అనురాధ బీరయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్, మండల పార్టీ అధ్యక్షులు కర్రే వెంకటయ్య, సర్పంచులు మొగిలిపాక తిరుమల రమేష్, తోటకురి బీరయ్య, డిసిసిబి డైరెక్టర్ మొగిలిపాక రాంచందర్, యాదగిరిగుట్ట పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి, ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, జిన్నా మాధవరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.