
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధి కుక్కల బెడద నివారణ చర్యలకు గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులు తీసుకున్న నిర్ణయాల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ అయినందున పెద్ద గ్రామంలో వాడవాడల్లో కుక్కల బెడద అధికంగా కావడం గ్రామస్తులు కుక్కల పట్ల ఆందోళన చెందుతున్న వాటిపట్ల గ్రామపంచాయతీ అధికారులు వీధి కుక్కల బెడద నివారణ చర్యలు చేపడుతూ.. కుక్కలను పట్టి తీసుకెళ్లే వారితో వాడవాడల్లో కుక్కలను పట్టుకుని చర్యలు చేపట్టడంతో కుక్కల నివారణ పట్ల గ్రామస్తుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.