– పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
– అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
నవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలం అపరిశుభ్రత కారణంగా గ్రామాల్లోని పలు వార్డుల్లో దోమలు,ఈగలు రాజ్యమేలుతాయి.వీటి వ్యాప్తితో చిన్న,పెద్ద తేడా లేకుండా అందరూ రోగాలతో మంచం పడుతుంటారు.వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మండలంలో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుధ్యం అపరిశుభ్రంగా మారింది.డ్రైనేజీ పరిశుభ్రం చేయపోవడంతో మురుగునీటితో దుర్గంధం వేదజల్లుతొంది. దీంతో దోమలు, ఈగలు రాజ్యమేలుతున్నాయి.
దోమల వ్యాప్తి ఎక్కువ..
వానాకాలంలో వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉంటుంది.నిల్వ నీటిలో దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. దోమల వల్ల టైపాయిడ్, మలేరియా జ్వరాలు వచ్చి కొందరు ఆసుపత్రుల పాలవుతున్నారు. గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో పెరుగుతున్న పిచ్చి మొక్కలు, మురుగు కాల్వలు సైతం దోమలకు అవాసాలుగా మారుతున్నాయి. దోమలు వ్యాప్తి చెందకుండా ఖాళీ స్థలాల్లో నీరు నిల్వలు ఉంచకుండా చూసుకోవాలి. వారానికి ఒక రోజు డ్రైడే నిర్వహించాలి. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి.అనారోగ్యం బారిన పడిన వారిని వెంటనే ఆసుపత్రిలో చూపించాలి.
గ్రామపంచాయతీల్లో ఇలా చర్యలు చేపట్టాలి..
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఇలా చర్యలు చేపట్టాలి. దోమలను చంపేoదుకు బయో లార్వాలను మురికి కాల్వల్లో నిల్వ నీరు ఉన్న గుంతల్లో పిచికారీ చేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బ్లీడింగ్ పౌడర్ చల్లాలి.
ఇవి పాటించాలి..
క్లోరినేషన్ చేసిన నీటిని, కాచి చల్లార్చిన నీటినే తాగాలి. క్లోరినేషన్ మాత్రలను తాగునీటి బిందెల్లో వేసి తాగాలి. పరిసరాల్లో పిచ్చి మొక్కలు లేకుండా, చెత్తా, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమ తెరలు వాడాలి. వేడి ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.