ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలి..

– ఆగ్రకుల దుహంకరానికి బలైన ఆశ్వరావ్ పెట్ ఎస్సై..
– నివాళులు అర్పించిన విద్యార్థి, ప్రజా సంఘాలు..
నవతెలంగాణ – వేములవాడ
ఆగ్రకుల దుహంకరానికి బలైన ఆశ్వరావ్ పెట్ ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని  విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు  ప్రవీణ్ కుమార్, బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత అధికారుల, కానిస్టేబుళ్ల వేధింపుల బరించలేక  భద్రాద్రి కొత్తగూడెం ఆశ్వరావ్ పేట ఎస్సై శ్రీ రాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి   చికిత్స పొందుతూ ఆదివారం రోజున మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆత్మ కు శాంతి చేకూరాలని విద్యార్థి ,ప్రజా సంఘాల  ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కుల అహంకార ధోరణి తో అగ్రాకుల అధికారులు సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్ లు ఎస్ఐ  శ్రీనివాస్ ను డ్యూటీ చేయకుండా అడ్డుపడుతూ కులం పేరుతో తిడుతూ మానసికంగా వేధించడం వల్లనే    ఎస్ఐ  ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్తితి వచ్చింది అని అన్నారు.సమాజం లో అంటరానితనానికి సమాజంలో అసమానతలు గురవుతున్న వారని రక్షించవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మిద ఉన్నదని,అలాంటి పోలీసు డిపార్మెంట్ లోనే  ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారి దళితుడు అయినదుకు అతనికి ఉన్నత అధికారులు కులం పేరుతో దుశించడం అనేది చూస్తే కుల రక్కసి ఈ రాష్ట్రములో ఎలా పేరుకుపేతుందో అర్దం అవుతుంది అని అన్నారు.చిన్న నాటి నుండి అనేక కష్టాలు పడి  అనేక అడ్డంకులు ఎదురుకొని  చదువు కొని జాబ్ తెచ్చుకుంటే ఈ విధంగా అగ్రకుల కుల దుహంకరానికి బలి కావడం బాధాకరమని అన్నారు.  ఆత్మహత్య సంఘటనను  సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టి నిందితులను  ఉద్యోగాలు తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్,వేణు, శ్రీకాంత్, నాగరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.