డాక్టర్ పై హత్యాచారానికి హత్యకు పాల్పడ్డ దుండగులను బహిరంగంగా శిక్షించాలి 

The perpetrators of the murder of Dr Pai should be publicly punished– డాక్టర్స్ చేస్తున్న ఆందోళనకి మద్దతు తెలిపిన ఐద్వా 
నవతెలంగాణ – కంటేశ్వర్ 
మృగాలకు పతనం ఎప్పుడు కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారానికి హత్యకు పాల్పడ్డ దుండగులను బహిరంగంగా శిక్షించాలి. నిజామాబాద్ జిల్లాలో డాక్టర్స్ చేస్తున్న ఆందోళనకి మద్దతుగా ఐద్వా శనివారం మద్దతు ప్రకటించారు.  ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. డాక్టర్ పై హత్యాచారానికి హత్యకు పాల్పడిన వాళ్లని బహిరంగంగా శిక్షించాలి. ఎందుకంటే దేశంలో కులము, మతం, ఉన్నవాడు, లేనివాడు ,తాగుబోతోడు ,తిరుగుబోతుడు అనే తేడా లేకుండా కేవలం వాళ్ల ప్రాణాలను కాపాడడమే నా బాధ్యతని భావించే ఒకే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం డాక్టర్లు మాత్రమే అని తెలియజేశారు. డాక్టర్లకు కూడా రక్షణ కల్పించకపోతే ఇంకెవరికి రక్షణ కల్పిస్తారు. దేశంలో రోజురోజుకీ హత్యలు, హత్యాచారాలు ,దాడులు పెరిగిపోతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని గుడిలో, బడిలో, రోడ్లపైన ఆఖరికి డ్యూటీలో ఉన్న డాక్టర్లపై కూడా విచ్చలవిడిగా మృగాలు లాగా ప్రవర్తిస్తుంటే ప్రాణాలు తీ తీస్తుంటే నిర్భయ దిశ ఫోక్సో చట్టాలు ఉండి కూడా ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి మన దేశంలో లేదు ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చేందుకు  ఒక్కరిని తెరపై చూపిస్తూ నేనే అత్యాచారం చేశాను అని బహిరంగంగా చెప్పడంలో దాగి ఉన్న లొసుకులు ఏంటో తేల్చాల్సిన అవసరం ఉంది అని తెలియజేశారు. ఎందుకంటే అమ్మాయి పై జరిగింది గ్యాంగ్ రేప్ దీన్ని కప్పిపుచ్చి జనాల్ని మబ్బ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఐద్వాగా  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, నగర నాయకులు వనజ,నాయకులు మాధవి తదితరులు పాల్గొన్నారు.