నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడిందని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ మంగళవారం తెలిపారు. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించగా ముతకూరు వంశీ గౌడ్ అను వ్యక్తి మద్యం త్రాగి పట్టుబడ్డాడు. అతనిపై ఐదవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిజామాబాద్ రెండవ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ మూతకూరు వంశీ గౌడ్ కి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్ఐ తెలిపారు.