వ్యక్తి మిస్సింగ్..

The person is missing..నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండల కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీకి చెందిన చెందిన వ్యక్తి మిస్సింగ్ అయ్యాడని దుర్గానగర్ కాలనీకి చెందిన చింతల మరియమ్మ ఫిర్యాదు ఇచ్చింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం తన భర్త అయిన చింతల సాయిలు, వయస్సు (55) సంవత్సరాలు తేదీ 18 -10 -224 నాడు ఉదయం 9 గంటలకు ఇంటి నుండి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు అని ఫిర్యాదు ఇచ్చినది. ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు తెల్లచొక్కా, నల్ల ప్యాంటు వేసుకొని ఎత్తు 5.0 ఫీట్స్ ఎత్తు కలిగి ఉన్నాడు అని తెలిపింది. చుట్టుపక్కల తెలిసిన బంధువుల ఇండ్లలో వెతికినా ఎలాంటి ఆచూకీ దొరకలేదని ఫిర్యాదు చేసిందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, పైన ఫోటో లో ఉన్న వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినచో ఈ క్రింది నెంబర్లకి తెలుపగలరని 8712686165, 8712666228 గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు.