చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నవతెలంగాణ – జమ్మికుంట
వ్యవసాయంలో దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పుల పాలై, మనస్థాపానికి గురై గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందాడని పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన నెల్లి శంకరయ్య(65) గత మూడు సంవత్సరాల నుంచి కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పుల పాలై మనస్థాపానికి గురై ఈనెల 6న ఉదయం ఏడు గంటలకు పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు సేవించాడు. జమ్మికుంట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 7న శుక్రవారం మరణించాడు. శుక్రవారం మృతుని భార్య నెల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు  సెక్షన్ 194 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.