భీంగల్ పట్టణ కేంద్రానికి చేరిన కర్నే మహేందర్ అనే వ్యక్తి పై దాడి చేసి గాయపరిచిన బెజ్జోర గ్రామానికి చెందిన భాస్కర్, శ్రీరామ్ రవి, పిట్ల రాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కర్నే మహేందర్ శుక్రవారం అర్ధరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ముగ్గురు మిత్రుల తో కలిసి ముచ్కుర్ నుండి భీంగల్ కు వస్తుండగా మార్గమధ్యలో బెజ్జోర గ్రామ శివారులో గల హనుమాన్ టెంపుల్ వద్ద రోడ్డుపై నుండి ఒక ఇసుక ట్రాక్టర్ వెళుతుండగా ట్రాక్టర్ వద్దకు వెళ్లి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు అని ట్రాక్టర్ డ్రైవర్ అడగగా, అదేసమయంలో అక్కడికి చేరుకున్న బెజ్జోర గ్రామానికి చెందిన భాస్కర్, శ్రీరామ్ రవి, పిట్ల రాజు ముగ్గురు కలిసి మీరెవరురా మమ్మల్ని అడిగేదని అక్కడే ఉన్న రాయితో మహేందర్ తలపై కొట్టగా తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.