వినతి పత్రం అందజే సిన కుద్వాన్పూర్ గ్రామ కమిటీ సభ్యులు

నవతెలంగాణ – ఆర్మూర్ 
నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో  రేణుక ఎల్లమ్మ దేవస్థానము కొరకు కమాన్ నుండి దేవస్థానము వరకు 2 కోట్ల రూపాయలతో  సి.సి. రోడ్డు,5 లక్షలు రూపాయలు లతో ఎలక్ట్రికల్ పోల్స్ (స్ట్రీట్ లైట్స్) 3లక్షలు రూపాయలు లతో మరుగుదొడ్ల నిర్మాణం కొరకు నిదులు మంజూరి చేయాలని గ్రామ కమిటీ సభ్యులు , కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఇటీవల వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా దేవస్థానమునకు విచ్చేసిన వినయ్ కుమార్ రెడ్డి  గ్రామ కమిటీ  ఆలయ కమిటీ సభ్యులు శనివారం పెద్ద మొత్తంలో స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్, ఆలూర్, డొంకేశ్వర్, మాక్లూర్ మండల అద్యక్షులు మంద మహిపాల్, విజయ్, భూమేష్ రెడ్డి, రవి, డొంకేశ్వర్ మాక్లూర్ పిఎసిఎస్ చైర్మెన్ లు భారత్ రెడ్డి,అశోక్  వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు సిలిండర్ లింగం, దేగం గంగారెడ్డి, పిప్పేరా సాయి రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు బైండ్ల ప్రశాంత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.