– మహిళలు ఎక్కువగా చదువుకొని అక్షరాలను ఆయుధాలుగా చేసుకోవాలి
– 80 మంది ఉత్తమ మహిళ ఉద్యోగులకు పురస్కారాలు అందజేత
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ- కంటేశ్వర్
పూలే దంపతులకు భారతరత్న అవార్డును ప్రకటించి వారి విగ్రహాలను పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సావిత్రిబాయి పూలేను మహిళలు మహిళ లోకం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో బీసీ టిన్యూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 80 మంది ఉత్తమ ఉపాధ్యాయుని, ఉత్తమ ఉద్యోగిని పురస్కారాలు – 2024 మహిళా ఉపాధ్యాయ, ఉద్యోగ సన్మాన సభ బీసీ టి యు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మాడ వేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి అర్ గోపాల కృష్ణ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, విశిష్ట అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్ నీతు కిరణ్, గౌరవ అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిసి విద్యావంతుల వేదిక ఎం. మారయ్య గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు బీసీ ఉపాధ్యాయ సంఘం సుంకర శ్రీనివాస్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్సా ఆంజనేయులు, మేడిదల ప్రవీణ్ గౌడ్, బీసీ ఉద్యోగ సంఘం నారాయణరెడ్డి, బీసీ ఉపాధ్యాయ సంఘం మహిళ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రాష్ట్ర గౌరవ సలహాదారులు రమణస్వామి, కొత్తూరు రమేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఏ మోహన్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కోశాధికారి రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయుని ఉత్తమ ఉద్యోగిని పురస్కారాలు 80 మందికి అందజేయడం అభినందనీయం అన్నారు. ఇంత పెద్ద కార్యాన్ని తమ భుజస్కందాలపై వేసుకొని విజయవంతం చేసిన ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. గోపాలకృష్ణ ను అభినందిస్తున్నామన్నారు. మహిళలు ఎక్కువగా చదువుకొని అక్షరాలను ఆయుధాలుగా చేసుకోవాలని తెలియ చెప్పిన మహానుభావులు జ్యోతిబాపూలే అన్నారు. మహిళలకు చదువు అత్యవసరమని మహిళలు చదువుకుంటే ఇంటితోపాటు సమాజం బాగుపడుతుందని నమ్మిన గొప్ప మహనీయులు అన్నారు. మహిళల చదువు గురించి ఆనాటి ఆలోచించి సావిత్రిబాయి పూలే ను చదివించడం గొప్ప విషయం అన్నారు. ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పూలే దంపతులకు భారతరత్న అవార్డును ప్రకటించి వారి విగ్రహాలను పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని గుర్తు చేశారు. అవార్డుల వల్ల బాధ్యత ఎంతో పెరుగుతుంది అన్నారు.
జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఆనాడే సావిత్రిబాయి పూలే రుజువు చేసిందని అన్నారు. జ్యోతిబాపూలే మహిళల చదువు ఎంతో ముఖ్యమని గ్రహించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను చదివించడం గొప్ప విషయం అన్నారు. ఈనాడు మహిళలు ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారంటే ఆ మహానుభావుల పుణ్యమే అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. మహిళలే మహారాణులని, మహిళలు చదువుకుంటే ఆ ఇంటి తో పాటు సమాజం బాగుపడుతుందని అన్నారు. ఇంత మంది ఉపాధ్యాయులు ఈ రోజు ఇంత మంది మహిళలు, ఉద్యోగాలు సాధించి ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారంటే అందుకు సావిత్రి బాయి పూలే కారణం అన్నారు. ఒక మహిళగా మేము కూడా రాజకీయంగా ఎదుగుతున్నామంటే, రాణిస్తున్నామంటే వారి అడుగు జాడల్లో నడవడం, సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు. బి సి టి యు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుని ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు అందజేస్తామని ఈసారి కూడా 80 మంది ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేయడం జరిగిందన్నారు. బి సి టి యు సంఘం మహిళా అభ్యున్నతి కోసం, మహిళా ఉద్యోగుల కోసం ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. మహిళలకు ఉద్యోగులకు పురస్కారాలు అందజేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు.