గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష 

– పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థమైంది
– సీఎం రేవంత్ బూతులు తిడుతూ.. అబద్ధాలు ఆడుతూ కాలం  వెలదీస్తున్నాడు
– నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు జిల్లా  మంత్రులు
– మాజీమంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్
– కేసీఆర్ కు  మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని వ్యాఖ్య 
– భారీ రోడ్ షో తో కృష్ణారెడ్డి నామినేషన్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ పార్లమెంటు లో జెండా ఎగరేస్తాం. ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తుంది.గులాబీ జెండానే తెలంగాణ కు శ్రీరామ రక్ష.పూటకో మాట మార్చే  పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థం అయింది.రుణమాఫీ పై మాట మార్చారు. అన్నదాతలను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్.సీఎం రేవంత్ భూతులు తిడుతూ, అబద్ధాలు ఆడుతూ, కాలం వెళ్ళిబుచ్చుతూన్నడు.డిప్యూటీ సీఎం భట్టి రుణమాఫీకి అంతా తొందర ఎందుకు అని అంటున్నాడు. నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు జిల్లా  మంత్రులు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ బిఆర్ఎస్ ఎంపీ  అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లo మల్లయ్య యాదవ్ లతో కలిసి హాజరయ్యారు.
నామినేషన్ అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సంధర్బంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే బి ఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు తధ్యమని తెలుస్తోందని ధీమా వ్యక్తంచేశారు.కేసీఆర్ కు  మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు. వంద రోజుల్లో నే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్య తిరేకత ఆరంభమైoదని చెప్పారు. డిసెంబర్ 9 తేదిన 6 గ్యారంటీల అమలు చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు.ఎన్నికల కు ముందు రైతు బంధు ఆపిన ఘనులు వీళ్ళేనని, రుణమాఫీ ఏమైందీ, హామీల అమలుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. రైతులు ఎండిన పంటల గురించి, రైతు బంధు గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టండి అన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చరిత్రలో నిలిచిపో తారని ఎద్దేవా చేశారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు వచ్చిందని నిరూపిస్తే  మా ఎంపీ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తామని, లేదంటే  మీ అభ్యర్థిని ఎన్నికల బరి  నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నిం చారు. గత 100 రోజుల్లోనే 200 రైతుల ఆత్మహత్యలు జరిగినందు కు, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండి 2 లక్షల ఎకరాలు ఎండినందుక ఓటు వేయాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నాగార్జునసాగర్ లో 508 లెవల్ ఉన్న ఎడమ కాలువ పరిధిలో సాగు నీరు ఇచ్చామని, మీరు మాత్రం రైతులకు ఇస్తామన్న బోనస్  వ్యాపారులకు ఇస్తున్నారని విమర్శించారు. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేయటంతోనే తక్కువ ధరకు ధాన్యం అమ్మల్సిన దుస్థితి ఏర్పడిందని, కెసీఆర్ తెచ్చిన పథకాలను నిర్వీర్యం చేశారని ద్వజమెత్తారు. గత ఐదేళ్ల లో ఎన్ని వ్యవసాయ పంపు సేట్లు కాలిపోయాయో,  నాలుగు నెలల్లో ఎన్ని మోటార్లు కాలిపోయాయో లెక్క తీద్దామా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఏ మొహం పెట్టుకొని నల్ల గొండ జిల్లాకు వస్తాడని మంత్రి కోమటిరెడ్డి అనడం సిగ్గు చేటని, ఫ్లోరైడ్ పీడిత జిల్లాను ధాన్యాగారం గా మార్చిన ఘనత కేసిఆర్ దేనని కొనియాడారు. ప్రజలకు మొహం చూపే ధైర్యం మీకే లేదని, నాగార్జు నసాగర్ డ్యాం మీదకు వెళ్లే ధైర్యం ఉందా, టెయిల్ పాండ్ నుంచి నీరు పోతుంటే ఇద్దరు మంత్రులకు సోయి లేదని దుయ్యబట్టారు. దీనిపై మాట దాటవేసిన ఇరిగేషన్ మంత్రికి, సెక్రటరీ కేంద్రానికి లేఖరా సింది నిజం కాదా అని ప్రశ్నించా రు. కాంగ్రెస్ అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిం దని ధ్వజమెత్తారు.