నవతెలంగాణ- హైదరాబాద్: సుమంత్ బొర్రా, వెంకటేష్ వుప్పల, తిరునగరి శరత్ చంద్ర, అనంత్ అశ్రిత్ లు ఈ సారి దేశభక్తిగీతంతో మనముందుకు వస్తున్నారు. సమాజంలో అడుగడుగున జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ, ప్రపంచం నలుమూలలా జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ ‘ప్రశ్నించు..ప్రశ్నించు’ అంటున్నారు. పాటనే బాణాలుగా, ఈటెలుగా, బాటగా చేసుకుని సమాజంపైకి ఎక్కుపెట్టి సంధిస్తున్నారు. దోపిడీలు, కల్తీసరుకులు,అక్రమాలు,పరాయి దేశంపై వ్యామోహం..ఇలా భారతదేశంలో జరుగుతున్న ప్రతి తప్పును తమ పాటలతో ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రభుత్వాలనే ప్రశ్నించాలంటున్నారు. ఇప్పటిదాకా మెలోడీ పాటలతో, విషాదగీతాలతో, భక్తిపాటలతో, ప్రేమపాటలతో, పబ్ సాంగ్స్ తో మిమ్మల్ని అలరించిన ప్లానెట్ రెడ్ మ్యూజిక్ టీమ్ ఈసారి కూడా మిమ్మల్ని అలరిస్తుంది. ప్రతి తప్పుని ప్రశ్నించేలా చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా మెసేజ్ ఇస్తుంది.
ఈ పాటకు మ్యూజిక్, మిక్సింగ్ & మాస్టరింగ్, ర్యాప్ ని వెంకటేష్ వుప్పల అందించగా, సుమంత్ బొర్రా, అనంత్ అశ్రిత్ లు పాడారు. తిరునగరి శరత్ చంద్ర ఈ పాటను రాశారు. సుమంత్ బొర్రా ప్రొడ్యూసర్ గా, బిపిన్ చంద్రహాస్ విజువల్ ఆర్ట్స్ ని అందించారు. ఈ పాట జనవరి 26 న ప్లానెట్ రెడ్ మ్యూజిక్ ఛానల్ లో రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్ గా అన్ని ఆడియో పోర్టల్స్ లో కూడా రిలీజ్ కానుంది..