నవతెలంగాణ – రెంజల్
హరితహారంలో భాగంగా మండలంలోని రోడ్డుకి ఇరుపక్కల మొక్కలు నాటాలని ఆదేశాలు రావడంతో ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు కు ఇరుపక్కల నాటిన మొక్కలు పెద్దవి కావడంతో అవి కరెంటు తీగలకు తగిలి తరచుగా విద్యుత్ అంతరాయం కలగడంతో విద్యుత్ శాఖ సిబ్బంది ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్నారు. గతంలో కూలీల చేత నాటిన మొక్కలను విద్యుత్ తీగల కింద నాటడం వల్లే వాటిని తరచుగా నడపవలసి వస్తుందని విద్యుత్ సిబ్బంది పేర్కొంటున్నారు. ముందుగానే కరెంటు తీగల కింద మొక్కలు నాటకుండా కొద్ది దూరంలో నాటినట్లయితే నరికివేత అనేది ఉండేది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నరికి నక్షత్రాలను అలాగే వదిలివేయడంతో రోడ్డుపై వెళ్లి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.