
నవతెలంగాణ – మల్హర్ రావు/మహాముత్తారం
మహాముత్తారం మండల కేంద్రంలో ప్రజలు నిత్యం ఆరాధించే గ్రామ దేవత పోచమ్మ తల్లి ఆలయానికి దారేదని, సందర్శకులు ఆలయానికి వెళ్లడానికి దారి ఇవ్వాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామం వెలసిన వేలాది సంవత్సరాల నుండి పోచమ్మ తల్లి గ్రామంతో పాటు ప్రతిస్థాపించారని తెలిపారు. గ్రామదేవత నమ్మిన,కొలిసిన సందర్శకులకు కొంగు బంగారం,ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రగాఢ నమ్మకం.గ్రామంలో పాడి,పశువులను కంటికి రెప్పలా కాపాడుతూ, గ్రామాన్ని రక్షించే పోచమ్మ తల్లి చెట్టు కింద కొలువైందన్నారు.ఇట్టి విషయాన్ని 20 సంవత్సరాల క్రితం గమనించిన గ్రామ భక్తులు లింగమల్ల జ్యోతి శంకరయ్య టీచర్స్, కీర్తి శేషులు లింగమల్ల పెద్ద సమ్మయ్య జ్ఞాపకార్థం.వీరి బందువులు లింగమల్ల.వెంకటస్వామి,లింగమల్ల పోచయ్య,గ్రామ భక్తుల కోరిక మేరకు,కీర్తి శేషులు వేముల రాజనర్సు, వేముల రాజపోసు పుణ్య దంపతుల సహాకారంతో,20 సంవత్సరాల క్రితం సుమారు రూ.1.50 లక్షలతో స్వంతగా ఆలయాన్ని నిర్మించారని గ్రామస్తులు తెలిపారు.ఈ గుడి నిర్మాణం తర్వాత తమ జీవితంలో గొప్ప మార్పు జరిగిందని దాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.కానీ గుడికి వెళ్ళి పోచమ్మ తల్లి మొక్కలు తీర్చుకోవడానికి వర్షాకాలంలో దారి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, గుడికి వెళ్ల డానికి దారి వేయాలని గ్రామస్తులు కోరుచున్నారు.