నవతెలంగాణ – నాగిరెడ్డి పెట్
వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికి నిండక పోచారం ప్రాజెక్టు వేల వేల పోతుంది. గత సంవత్సరం జూలై 21 తేదీన పొంగి పొర్లిన పోచారం నేడు వేలవేల పోయింది. రెండు నెలల నుండి ముఖం చాటేసన వర్షాలు రెండు రోజుల నుండి చిన్నపాటి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గత సంవత్సరం నాట్లన్నీ పూర్తి చేసుకున్న రైతులు ప్రస్తుతం రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి నాట్లలో నిమగ్నమయ్యారు. రెండు రోజుల నుండి ప్రారంభమైన వర్షానికి పోచారం నిండుతుందా పొంగిపొర్లుతుందా పోచారం పైనే ఆశలు పెట్టుకున్న రైతన్నలు..