
– సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీనివాస్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను తూచా తప్పక పాటించాలని సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీనివాస్ సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. షేడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి, హైదరాబాద్ వారి ఆదేశానుసరము ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని షెడ్యూల్డ్ కులముల ఏఎస్డబ్ల్యూఓ లు, వార్డెన్లకు బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఒక రోజు శిక్షణా కార్యక్రమము (ఓరియంటేషన్ ప్రోగ్రాం )ను నిర్వహించారు. ఈ శిక్షణ లో విధ్యార్ధులకు కౌమారా దశలో వచ్చే సమస్యలు, భావోద్వేగాల నియంత్రణ, సమస్యల నిర్వహణ, పరీక్షల భయము, ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, స్వీయ హాని, నిరాశ, ఆహార భద్రత, ఆత్మహత్య ఆలోచనలు తదితర అంశముల పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ యం. జైపాల్ రెడ్డి, కే. లత సూర్యాపేట జిల్లా, మానసిక నిపుణులు డా. విజయ్ కుమార్, డా. శివ కుమార్, స్త్రీ ఆరోగ్య సంరక్షకులు డా. అరుంధతి, డా. సుందరి, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కుమారి స్వాతి, షి-టీం ఎస్సై కోటేష్, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.