– తల్లిదండ్రుల సమక్షంలో వార్డెన్‌కు అప్పగింత
నవతెలంగాణ-మాడ్గుల
మండలం కొత్త బ్రాహ్మణపల్లిలోని సెయింట్ గైతాన్స్ స్కూల్‌కు చెందిన హాస్టల్ నుండి విద్యార్థులు ఆకాష్, రాజవీర్‌లు ఇద్దరు రెండు రో జులు శని, ఆదివారాలలో సెలవు దినం కావడంతో తమ తల్లిదం డ్రులు తమని చూడటానికి రాలేదని తమలో తాము బాధపడుతూ ఎవరికీ చెప్ప కుండా హాస్టల్ గోడదూకి పారిపోయారు. పాఠశాల యాజమాన్యం స్థాని క పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీ సుల వివిధ వాట్సాప్ గ్రూపులలో వారి ఫోటోలను షేర్ చేశారు. వారు ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గేట్ వద్ద ఉన్నారని సమాచారం తెలియడంతో పెట్రోలింగ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రోషనప్ప, కానిస్టే బుల్ రాషేద్‌ఖాన్‌లు స్పందించి వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో హౌస్టల్ వార్డెన్‌కు అప్పగించినారు. వెంటనే స్పందించిన పోలీసుల పట్ల మండలంలో పలువురు అభినందనలు తెలిపారు.