పోగొట్టుకున్న రూ.25 వేల విలువగల బంగారాన్ని బాధితులకి నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్పగించారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి డ్రంకెన్ డ్రైవ్ వెహికల్ షూరిటీ కొరకు జనార్ధన్ వ్యక్తి రాగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు తన వద్ద ఉన్న 3 గ్రాములు విలువ రూ.25 వేలు విలువ గల బంగారాన్ని పోగొట్టుకోగా అట్టి బంగారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండి. ఫైజుద్దీన్ కి దొరకగా అట్టి వ్యక్తిని గుర్తించి మంగళవారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బంది అతని కి అప్పగించడం జరిగినది, ఇట్టి సందర్భముగా కానిస్టేబుల్ ఫైజుద్దీన్ నీ ఇన్స్పెక్టర్ అభినందిస్తూ బాధితుడు సంతోషాన్ని వ్యక్తం చేసి, ట్రాఫిక్ వారికి ధన్యవాదలు తెలియజేశారు.