పోగొట్టుకున్న సెల్ఫోన్లను బాధితులకు అప్పగించిన పోలీసులు

నవతెలంగాణ-చిలిపిచెడ్‌
చిలిపిచేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులకు చిలిపిచెడు పోలీసులు బుధవారం తిరిగి ఫోన్‌ రికవరీ చేసి బాధితులకు అందించారు. అనంతరం ఎస్సై మహమ్మద్‌ గౌస్‌ మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సీఈఐఆర్‌లో కంప్లైంట్‌ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సెల్ఫోన్లను పట్టుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులు సెల్‌ ఫోన్లను రికవరీ చేసి చిలిపిచేడ్‌ గ్రామానికి చెందిన నర్సింలు, చండూరు గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే బాధితుడికి సెల్ఫోన్‌ అందజేశారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.