పోయిన ఫోన్ ని పట్టుకొని భాదితుడికి అప్పగించిన పోలీసులు

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
20రోజుల క్రితం అనగా 20.01.2024 నాడు బోల్లేపల్లీ గ్రామానికి చెందిన సందెల అశోక్,  అతని వైఫ్ బైక్ మీద వెళ్తుంటే అశోక్ పాయింట్ పోకెట్ నుంచి వివో  మొబైల్  జారీ పడిపొంది. ఇంటికి వెళ్లి చూసుకోగా, మొబైల్ కనిపించలేదు. మొబైలు ఖరీదు రూ.25,000 భాదితుడు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, అతని మొబైల్ వివరాలు, సెయిర్ పోర్టల్ లో నమోదు చేసి, ఐఇమెయి  నంబర్స్ ఆధారంగా, అట్టి మొబైల్ ఆచూకీ కనిపెట్టి, భాదితుడికి అతని మొబైల్ ని భువనగిరి రూరల్ పోలీసులు అప్పగించారు. ఫోన్ ఆచూకీ కోసం కృషి చేసిన భువనగిరి క్రైమ్ కానిస్టేబుళ్లు యస్. నరేందర్, జి చెన్నకేశవులును భువనగిరి రూరల్ ఎస్‌ఐ వి సంతోష్ కుమార్ అభినందిచారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లైతే ఇమెయిఐ  వివరాలు, బాధితుడి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే మొబైల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని భాధితులకు అందజేస్తామని ఎస్‌ఐ వి.సంతోష్ కుమార్ తెలిపారు. భాదితులు పోలీస్ స్టేషన్ కి రాలేక పోయే పరిస్థితిలో ఉంటే సెయిర్  పోర్టల్ లో లేదా మీసేవ లో కూడా అప్లై చేసుకోవచ్చునని తెలిపారు.