రెండు వారాల క్రితం అనగా 18.06.2024 నాటి నుంచీ ఈ రోజు వరకు పోయినటువంటి మొబైల్స్ హన్మాపురం గ్రామానికి చెందిన సోమ మహేష్ అనే అతని మొబైల్ వివో యొక్క కారిధు 11,999 , ఆకుతోట బావి తండ చెందిన కేతవాత్ రాజ్ కుమార్ అనే అతని మొబైల్ రెడ్మీ కారిధు 18,999 ,రాజాపేట మండలం బేగంపేట్ గ్రామానికి చెంధీన నీల బాలకృష్ణ అనే అతని మొబైల్ వివో కారిధు 21,999 వల్ల మొబైల్ పోవడంతో భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో పిర్యాధు ఇవ్వగా వీళ్ళ మొబైల్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసి ఐఎంఈఐ నంబర్స్ ఆధారంగా అట్టి మొబైల్ ఆచూకీ కనిపెట్టి భాదితుడికి అతని మొబైల్ ని భువనగిరి రూరల్ పోలీసులు అప్పగించారు. ఫోన్ ఆచూకీ కోసం కృషి చేసిన భువనగిరి క్రైమ్ కానిస్టేబుళ్ జి చెన్నకేశవులును భువనగిరి రూరల్ ఎస్‌ఐ వి సంతోష్ కుమార్ అభినందిచారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లైతే సిమ్ము, ఐఎంఈఐ వివరాలు, బాధితుడి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే మొబైల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని భాధితులకు అందజేస్తామని ఎస్‌ఐ వి సంతోష్ కుమార్ తెలిపారు.