ఆగస్టు 5వ తేదీ 2024వ రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి వద్ద ఫంక్షన్ హాల్ పోగొట్టుకున్న రెండు మొబైల్ పోలీసులు ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా పట్టుకొని వారికి బుధవారం అప్పగించారు. భువనగిరి రూరల్ ఎస్సై వి సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 5వ తేదీ 2024 రోజున పట్టణ శివారులో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి లో గల ఫంక్షన్ హాల్ నందు పోయినట్టువంటి మొబైల్స్ అనగా మీసాల నవీన్ , అరుణ్ సింగ్ లా మొబైల్స్ వారికి వెతికి ఇవ్వడం జరిగిందని, ఆ మొబైల్ వివో , అట్టి మొబైల్ కాస్ట్ 20,999 , ఒప్పో మొబైల్ అట్టి మొబైల్ కాస్ట్ 18,999 మొబైల్ పోవడంతో భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో పిర్యాధు ఇవ్వగా వీళ్ళ మొబైల్ వివరాలు సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో నమోదు చేసి ఐ ఎమ్ ఈ ఐ నంబర్స్ ఆధారంగా అట్టి మొబైల్ ఆచూకీ కనిపెట్టి భాదితుడికి అతని మొబైల్ ని భువనగిరి రూరల్ పోలీసులు అప్పగించారు. ఫోన్ ఆచూకీ కోసం కృషి చేసిన భువనగిరి క్రైమ్ కానిస్టేబుళ్ జి.చెన్నకేశవులును భువనగిరి రూరల్ ఎస్‌ఐ వి.సంతోష్ కుమార్ అభినందిచారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లైతే ఐ ఎం ఈ ఐ వివరాలు, బాధితుడి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే మొబైల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని భాధితులకు అందజేస్తామని ఎస్‌ఐ వి.సంతోష్ కుమార్ తెలిపారు.