పోయిన ఫోన్ ని పట్టుకొని భాదితుడికి అప్పగించిన పోలీసులు ..

The police caught the lost phone and handed it over to the accused.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మోటకొండూరు మండలానికి చెందిన ఎండి లతీఫ్ ఈనెల 28వ తేదీన రాయగరికి వచ్చి వెళ్తుండగా, మార్గమధ్యంలో పోయినది. ఆయనతోపాటుగా భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసచారి అదే రోజు భువనగిరి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా అనంతారం ఎక్స్ రోడ్డు వద్ద మొబైల్ ఫోన్ పోయినది. ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా మొబైల్ ఫోన్లను తిరిగి వారికి అప్పగించినట్లు భువనగిరి రూరల్ ఎస్సై వి సంతోష్ కుమార్ తెలిపారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లైతే  ఐఎంఈఐ   వివరాలు, బాధితుడి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే మొబైల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని, భాధితులకు అందజేస్తామని సిఐ వి సంతోష్ కుమార్ తెలిపారు. క్రైమ్ కానిస్టేబుల్ చెన్నకేశవులను ఎస్ఐ అభినందించారు.