ఒకటవ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటిన పోలీసులు 

The police planted saplings in the premises of the first police stationనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ ఆవరణంలో వనోత్సవం కార్యక్రమంలో భాగంగా 1వ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు ఆధ్వర్యంలో గురువారం పోలీసులు, సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అందులో భాగంగానే నాటిన మొక్కను పెంచాల్సిన బాధ్యత కూడా మన పైననే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటవ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుళ్ళు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.