
రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన కట్ట బాబు భార్య కాపురానికి రావడం లేదని రథాల గైన్ లోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించగా, గమనించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది సహకారంతో సురక్షితంగా క్రిందికి దించారు. సాహసం చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందించారు. సంఘటనలో ఎస్సై విజయ్ కొండ, పోలీస్ సిబ్బంది రంజిత్ రెడ్డి, మురళి మోహన్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.