నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆంధ్రా నుండి తెలంగాణా లోని కబేళాలకు అక్రమంగా తరలిస్తున్న పశువులను అశ్వారావుపేట పోలీస్ లు అడ్డుకున్నారు. అదనపు ఎస్ఐ శివరాం క్రిష్ణ తెలిపిన వివరాలు ప్రకారం తెలంగాణ నల్గొండ కు చెందిన శ్రీను,ఆంధ్రా అనకాపల్లి కి చెందిన బాబ్జీ లు తూర్పు గోదావరి జిల్లా,జగ్గంపేట నుండి 35 పశువులను మైసూర్ వాహనంలో అశ్వారావుపేట మీదుగా హైద్రాబాద్ కబేళాలకు తరలిస్తున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం తెల్లవారు జామున అశ్వారావుపేట పోలీస్ సిబ్బంది వాహనం తనిఖీ చేయగా పశువులు ఉన్నట్లు గుర్తించారు.అందులోని 35 పశువులను పాల్వంచ గోశాల కు తరలించి,కేసు నమోదు చేసినట్లు తెలిపారు.