నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి ప్రాథమిక పాఠశాలలో 52వ బూతు వద్ద 5:00 గంటలకే పోలీసులు గేటు వేశారు.ఈ ప్రాథమిక పాఠశాలలో రెండు బూతులు ఉన్నాయి పోలింగ్ బూత్ 52లో 1301 ఓటర్లు ఉన్నారు ఉదయం 7:00 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 5:00 గంటల వరకు ఓటర్లు లైన్లో భారీగా నిలుచున్నారు.ఎన్నికల ప్రిరీసైడింగ్ అధికారి లైన్లో నిలుచున్న ఓటర్లకు సీరియల్ గా నెంబర్లు కేటాయించారు.ఓటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బూతులో ఎక్కువ ఓటర్లు ఉండేసరికి చాలా ఇబ్బంది కలుగుతుందని ఓటర్లు చెప్తున్నారు.నీళ్లు లేవు, మహిళా ఓటర్లు లైన్లో నిల్చొని కాలు నొప్పులు పెడుతున్నాయని త్రీవ ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ బూత్ లో ఉన్న ఓటర్లను మరొక బూత్ ఏర్పాటు చేయాలని అంటున్నారు.