– విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసిందని వెంటనే వారిని అరెస్టు చేయాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. జనగామలో పోలీసులు న్యాయవాదులు అమృత రావ్, కవితలపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. రక్షణ చట్టాన్ని తీసుకురావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ మాట్లాడుతూ కేసు విషయంలో జనగామ పోలీసులపై ప్రభుత్వం కేవలం ఎస్‌ఆర్‌ఐ నమోదు చేసి చేతులు దులుపుకుందన్నారు. వెంటనే వారిని అరెస్టు చేయాలన్నారు. పోలీసులు, న్యాయవాదుల పరస్పర సంబంధాలు బాగుండాలని, దాడులకు పాల్పడవద్దని హితవు పలికారు. దాడులు ఇలానే కొనసాగితే అన్ని బార్ కార్యాయాల్లో విధులు బహరిష్కరించి పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసొసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్, క్రీడాల కార్యదర్శి ముజహిద్, శ్రీనివాస్ రెడ్డి, ఎండీ గౌస్, రవీందర్, మల్లిఖర్జున్, మన్షీర్, ఇమాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ : నిరంతరం వృత్తిలో న్యాయం కోసం పాటుపడుతున్న న్యాయవాదులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఉట్నూర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బానోత్ జగన్, ఉపాధ్యక్షులు ధీరజ్ గుప్తా డిమాండ్ చేశారు. జనగామలో న్యాయవాద దంపతులపై పోలీస్‌ల దౌర్జన్యానికి నిరసనగా గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. దాడులకు నిరసనగా 8, 9 తేదీల్లో విధులు బహిష్కరిస్తూ తీర్మానం చేశామన్నారు. న్యాయవాదులపై తరుచుగా జరుగుతున్న దాడులను నియంత్రించాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం అమలుతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కోశాధికారి చింతల గిరి, న్యాయవాదులు బానోత్ జైవంత్ రావు, పవార్ వసంత్ రావు, కుడెల్లి అశోక్, నాతరి రాజు పాల్గొన్నారు.