మండల కేంద్రంలోని స్థానిక హరిత రిసార్ట్ లో మండలానికి చెందిన వివిధ సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో జన్నారం మండలానికి సంబంధించిన, చెరువుల ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు శ్రీరాముల భూమాచారి చైర్మన్ కమ్మల విజయ్ ధర్మ వైస్ చైర్మన్ శనిగారపు మహేష్ ప్రధాన కార్యదర్శి కనికారపు ప్రభంజనం కార్యదర్శి వెంబడి సత్యం ట్రెజరర్ కోడి సృజన్ కార్యదర్శి మామిడి విజయ్ సలహాదారులు దాసరి తిరుపతి కొండపల్లి మహేష్ కార్యవర్గ సభ్యులు ఊరే వెంకట సాయి ఎండి ఎజాస్ మూగల వెంకటేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, సందర్భంగా వారు మండలంలోని ఏ గ్రామంలోనైనా ఊర చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వాటి పరిరక్షణ ధ్యేయంగా ఈ కమిటీ పని చేస్తుందని సూచించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.