అవయవ అక్రమ వ్యాపారంలో పేదలే సమిధలు

The poor are the mainstays of the illegal organ tradevపేదల ఆర్థిక అవసరాలే అవయవాల అక్రమ వ్యాపారానికి పెట్టుబడిగా మారుతున్నాయి. గుంటూరుకు చెందిన ఆట్రో డైవర్‌ ఆర్థిక పరిస్థితి, అతడి అప్పులను ఆసరాగా చేసుకొని కిడ్నీ తీసుకున్న ఘటన ఇటీవల విజయవాడలో కలకలం రేపింది. అయితే రూ. 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని రూ.1.10 లక్షలు మాత్రమే చెల్లించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అమి విచారణకు ఆదేశించింది. గతంలో విశాఖపట్నంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో చట్టవిరుద్ధంగా పదిశాతం మేర కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని గతంలో నగర పోలీసు కమిషనర్‌ కూడా చెప్పడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అక్రమ అవయవ వ్యాపారం ధనవంతుల జీవన ప్రమాణాలను పెంచుతుండగా.. మధ్యవర్తులకు లాభాల పంటను పండిస్తున్నది. అదే సమయంలో పేదలను మాత్రం ‘సమాధి’ చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ, విజయవాడలో వెలుగుచూసిన ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సోషల్‌ మీడియా ద్వారానూ ఈ ఆర్గాన్‌ రాకెట్‌ యథేచ్ఛగా కొనసాగుతుండటం ఆందోళనకు గురి చేస్తున్నది.ఇండియాలో విదేశీయుల హ్యూమన్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ రాకెట్‌ను ఇటీవల ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఒక మహిళా డాక్టర్‌ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో దాతలు, గ్రహీతలతోపాటు కీలక సూత్రధారి బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. 2019 నుంచి ఈ ఆర్గాన్‌ రాకెట్‌ కొనసాగుతున్నదని నిర్ధారించారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ రాకెట్‌ ఢిల్లీలోని ఒక మహిళా డాక్టర్‌ సహాయంతో నోయిడాలోని ఆస్పత్రిలో 15 నుండి 16 కిడ్నీలు మార్పిడి చేసినట్లు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, బంధువుల పేరుతో ప్రవేశపెట్టి కిడ్నీ మార్పిళ్లు చేస్తున్నట్లు నిర్ధారించారు.
భారతీయులను విదేశాల్లోకి తీసుకెళ్లి..
ఇండియాలో వెలుగుచూసిన పలు ఆర్గాన్స్‌ రాకెట్స్‌లో అంతర్జాతీయంగా వ్యాపారం కొనసాగుతున్నట్లు తేలింది. 2024 మేలో వెలుగు చూసిన హైదరాబాద్‌ వయా కొచ్చి టూ ఇరాన్‌ కేంద్రంగా నడిచిన ఓ కిడ్నీ రాకెట్‌ గతంలో భారతదేశంలో సంచలనం సృష్టించింది. ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ ముఠా పేద యువకులను లక్ష్యంగా చేసుకుని ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని ఆశజూపి.. ఇరాన్‌కు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అక్కడ కిడ్నీలు తీసుకుని.. తిరిగి ఇండియాకు తీసుకొస్తున్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్‌, కేరళకు చెందిన 40 మంది యువకులను ఇలా ఇరాన్‌ కు తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేయించినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీలంక, ఈజిప్ట్‌, టర్కీలకు సైతం తీసుకెళ్లి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు కొన్ని కేసుల్లో నిర్ధారించారు.
పేదరికాన్ని ఆసరాగా చేసుకొని..
పేదల ఆర్థిక అవసరాలే అవయవాల అక్రమ వ్యాపారానికి పెట్టుబడిగా మారుతున్నాయి. గుంటూరుకు చెందిన ఆట్రో డైవర్‌ ఆర్థిక పరిస్థితి, అతడి అప్పులను ఆసరాగా చేసుకొని కిడ్నీ తీసుకున్న ఘటన ఇటీవల విజయవాడలో కలకలం రేపింది. అయితే రూ. 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని రూ.1.10 లక్షలు మాత్రమే చెల్లించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అమి విచారణకు ఆదేశించింది. గతంలో విశాఖపట్నంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో చట్టవిరుద్ధంగా పదిశాతం మేర కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని గతంలో నగర పోలీసు కమిషనర్‌ కూడా చెప్పడం గమనార్హం.
సోషల్‌ మీడియా ద్వారా..
సోషల్‌ మీడియా ద్వారానూ అక్రమ అవయవ వ్యాపారం కొనసాగుతున్నట్లు అర్థమవుతున్నది. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ వ్యవహారం కూడా సోషల్‌ మీడియా పరిచయాల ద్వారానే జరిగినట్లు తెలుస్తున్నది. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబుకు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన బాషా కిడ్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇవ్వడంతోనే మధుబాబు దానికి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు మానవ అవయవాలను విక్రయించేందుకు ఓ ప్రముఖ ఆస్పత్రి వెబ్‌ సైట్‌ను పోలి ఉన్న ఓ నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు 2023లో గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు ఆఫ్రికన్‌ పౌరులతో సహా ఐదుగురిని చెన్నై పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఓ ముఠా ఈ నకిలీ వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు కేసు దర్యాప్తులో తేలింది. ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి మానవ అవయవాలను మార్పిడి చేయడానికి ఈ ముఠా రూ.5 కోట్ల వరకు ధర చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. అవయవదానం పేరుతో ఫేస్‌బుక్‌ అడ్డాగా దందా సాగిస్తున్న గ్యాంగ్‌ను గతంలో రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు.అవయవాల మార్పిడిలో కిడ్నీలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటున్నది. జీవన్‌ దాన్‌ వెబ్‌ సైట్స్‌ లో వంద మంది అవయవదానం కోసం ఎదురు చూస్తుంటే వాటిలో కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నవారే 70 మంది వరకు ఉంటారు. కిడ్నీ మార్పిడి అవసరమైన వాళ్లు దేశంలో ఏటా సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల నుంచి 9 లక్షల మంది వరకు కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు.
కఠిన శిక్షలున్నా..
ఎవరికైనా బ్రెయిన్‌ డెడ్‌ అయితే వారి బంధువుల అనుమతితో అవయవదానం చేయవచ్చు. అలాగే రక్త సంబంధీకులు వారి కుటుంబ సభ్యులకు అవయవదానం చేయవచ్చు. రెండు కిడ్నీలు, రెండు కళ్లు, రెండు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె ఇలా ఒక మనిషి అవయవదానం చేస్తే ఎనిమిది మందికి ప్రాణం పోయవచ్చు. అయితే అవయవదానం చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఎవరైనా అవయవదానం చేస్తే అది నేరం. వారికి ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది.
అవయవ మార్పిడి చట్టం-1994 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఆపరేషన్‌ చేసిన డాక్టర్ల రిజిస్ట్రేషన్‌, ఆపరేషన్‌ జరిగిన ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తారు. అవయవదాన చట్టంలో 2023లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. నోటో (నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌)లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అందుబాటులో ఉంచింది.

– ఖిజర్‌ పాషా, 8008710143