పేదలు ఉపాధి హామీని వినియోగించుకోవాలి

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉపాధి హామీ 18 వఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పునూతల మండలం పెద్ధాపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు  ఉపాధి హామీ కూలీలతో కలిసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండలం పెద్దాపూర్ గ్రామంలో అత్యధికంగా 59 మంది కుటుంబాలు వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఉపాధి హామీక్షేత్ర సహాయకుడు ఉల్పర మశన్న కి శాలువా సత్కారం చేయడం జరిగింది. అనంతరం ఏపీఓ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ..గ్రామాల్లో పేదల పాలిటి పెన్నిధి ఉపాధి హామీ అని అందరుకూడ ఇట్టి పనులకు వెళ్లి జీవనోపాధిని కల్పించుకొని ప్రతి ఒక్క కుటుంబం వంద రోజులు పూర్తి చేసుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఈసి రవిరాజు, టి ఎ ఉమాపతి, పంచాయతీ సెక్రటరీ మహేష్, ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు.