పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ..

Poor should take advantage of government welfare schemes..– కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ 
నవతెలంగాణ – అచ్చంపేట 
ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే అంబేద్కర్ ప్రజా భవన్ లో  నియోజకవర్గంలోని వివిధ మండలాల గ్రామాలకు చెందిన  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ గ్రామాలకు చెందిన  కళ్యాణ లక్ష్మి,  షాది ముబారక్ 270 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్  137 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో మండలాల తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులు  కార్యకర్తలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.