దాడులు అంతం కావాలి : పోప్‌

వాటికన్‌ సిటీ: ఇజ్రాయెల్‌ పాలస్తీనాలో శాంతి కోసం పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, యుద్ధం పరిష్కారానికి దారితీయవు” అని వాటికన్‌లోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ నుంచి ఇచ్చిన సందేశంలో పోప్‌ పేర్కొన్నారు. . దాడులు వెంటనే ఆపాలి. ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో శాంతి కోసం ప్రార్థిద్దాం. దాడులు , ఆయుధాలను నిర్మూలించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అని పోప్‌ తన సందేశంలో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌లో18వేల మంది భారతీయులు
హమాస్‌ ఉగ్రవాదుల దాడులతో ఇజ్రాయెల్‌లోని పరిస్థితులు భీతావహంగా మారాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లో ఉన్న దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో హైవేలపైనే చిక్కుకుపోయినట్లు సమాచారం. వీళ్లలో కొందరు బతుకు తెరువుకోసం వెళ్లిన వాళ్లుకాగా, మరికొందరు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు.ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నవారిలో భారత్‌ రాజ్యసభ ఎంపీ వాన్‌వేరురారు ఖార్లుఖీ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు.