
నవతెలంగాణ – రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పార్టీ మారి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని, కనీస ఫోటో కాల్ పాటించటం లేదని శనివారం రాత్రి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. 20 సంవత్సరాల నుండి కష్టపడిన కార్యకర్తలు గుర్తింపు లేదని ప్రశ్నిస్తే గుండా గిరి చేసి , దూషిస్తూ దాడులు చేస్తున్నారని, స్థానికంగా ఉండకుండా ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉంటూ, నాయకులతో కాకుండా వ్యక్తిగత సిబ్బందితో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయకుండా, పార్టీ కార్యక్రమాలను , మాజీ ప్రధాని ఇందిరా గధీ జయంతి వేడుకలను కూడా నిర్వహించలేని దుస్థితిలో నియోజకవర్గం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ధర్నాలు ర్యాలీలతో పాటు, ప్రభుత్వంపై, పార్టీపై ఆరోపణలు చేస్తే ఏ ఒక్కరు కూడా కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవని మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రడ్డి, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.