నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న బీపీఎం పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుతూ స్థానిక ఎంపీడీవో కు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ వర్కట్ పల్లి గ్రామంలో బిపిఎం పోస్టు ఖాళీగా ఉండడం వల్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు గత ఆరు నెలలుగా పని చేసిన వారి కూలీ డబ్బులు వారి చేతికి అందలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. అదేవిధంగా అనేకమంది పెన్షన్దారులకు సకాలంలో పెన్షన్లు అందకపోవడం జరుగుతుందని వెంటనే ప్రభుత్వం అధికారులు బిపిఎం ఖాళీ పోస్టును భర్తీ చేసి ఉపాధి హామీ కూలీల, పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చేగురి నరసింహ, ఉపాధి హామీ కూలీలు గుర్రం అంజయ్య, మీసాల ఇస్తారి, ఐతరాజు బుచ్చయ్య, బంగారు బొందయ్య, మీసాల పోశయ్య,కందుకూరి బుచ్చయ్య,ఐతరాజు నరసింహ,షేక్ కరీం ,మీసాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.