పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు: ఎమ్మెల్యే

నవతెలంగాణ – రామారెడ్డి
పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో పదవులు దక్కుతాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపి లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేయాలని బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మండల కేంద్రంలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్ లో మండల స్థాయి ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామా కార్యకర్త విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. పది సంవత్సరాలు ఎంపీగా బిబి పాటిల్ రామారెడ్డికి చేసింది శూన్యమని, రామారెడ్డి మండల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటింటికి తీసుకెళ్లి, రామారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షట్కర్ కు అధిక మెజార్టీ వచ్చేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మా గౌడ్, గిద్ద ఎంపిటిసి ప్రవీణ్ గౌడ్, తూర్పు రాజు, కందూరి లింబాద్రి, లక్కాకుల శేఖర్, తూర్పు సుబ్బన్న, నామాల రవి, బి పేట నర్సింలు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.