– వాంగ్మూలం నమోదు చేసిన అదనపు కలెక్టర్
– వారంలో రెండో ఎంక్వయిరీ కొనసాగే అవకాశం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ డీఆర్డీఏ మాజీ పీడీ కాళిందినిపై శుక్రవారం ప్రాథమిక విచారణ పూర్తయింది. జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర తన చాంబర్లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు డిఆర్డిఏ మాజీ పిడి కాలిందిని, సామాజిక కార్యకర్త కట్ట వెంకటేశం, ఆర్టిఐ కార్యకర్త కల్లూరి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ విచారణలో అదనపు కలెక్టర్ వారి నుండి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా విచారణను మరో రెండు, మూడు సార్లు కొనసాగించే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో రెండవ విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. కాగా సాక్షాధారాలను సామాజిక కార్యకర్త కట్ట వెంకటేశం, ఆర్టిఐ కార్యకర్త కల్లూరి వెంకటేశం లు అందించేందుకు ప్రయత్నించగా కావలసినప్పుడు అడుగుతామని, రెండవ విచారణలో వీడియో కూడా తీస్తామని అదనపు కలెక్టర్ సూచించినట్లు ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు.