నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నూతనంగా ఏర్పడిన తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ పాలకవర్గాన్ని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గం ఇటీవల ఏర్పడడంతో నూతన పాలకవర్గాన్ని తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు చెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు బుధవారం నూతన సంవత్సర సందర్భంగా ప్రెస్ క్లబ్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గూడూరి భాస్కర్,ఇటికల రాజు , కోస్ని వినయ్,కన్నె అరుణ్, శ్రీను, బొలిగం భాస్కర్, కాళీ చరణ్ పాల్గొన్నారు.