కండ్లకు నీళ్లు తెప్పిస్తున్న ఉల్లిగడ్డ ధర 

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 

మండల కేంద్రంలోని అంగడిలో ఉల్లిగడ్డ ధర ప్రజలకు కళ్ళకు నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిగడ్డ ధర శనివారం కిలో 40 రూపాయలు 100కు రెండు కిలోలనర అమ్ముతున్నారు. గత వారం చూసుకుంటే కిలోకు 20 రూపాయలు 100కు 5 కిలోలు ఇచ్చేవారని ప్రజలు అంటున్నారు. ధర ఎందుకు పెరిగిందని వ్యాపారస్తులను ఆరా తీస్తే తెలంగాణలో లోకల్ ఉల్లిగడ్డ పంట లేదని వేరే ఉల్లిగడ్డ అయితే మన ప్రజలు కొనుగోలు చేయరని, గుజరాత్ నుంచి మన లోకల్ ఉల్లిగడ్డను దిగుమతి చేసుకోవడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ కావడంతో కిలో 40 రూపాయలు 100కు రెండు కిలోలరా అమ్ముతున్నట్టు వ్యాపారాలు తెలిపారు. ప్రతి వంటకంలో ఉల్లిగడ్డ అవసరం అవడంతో ప్రజలు ప్రతి ఒక్క కుటుంబము ఉల్లిగడ్డ కొలుగోలు చేస్తున్నారు ప్రస్తుతము ఉల్లిగడ్డను కొనాలంటే ప్రజలు ధరలు చూసేసరికె ఉల్లిగడ్డ కొనాలంటే వెనుకడుగు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కిలో 20 రూపాయలకు ఉల్లిగడ్డ అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.