– రూ.100 దాటిన పచ్చిమిర్చి
– చేతి కందని టమాటా
నవతెలంగాణ-దోమ
కూరగాయల ధరలతో సామాన్యుడు విలవిల లాడు తున్నాడు. టమాటా, పచ్చి మిర్చి రేటు మరోసారి మండి పోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలు కుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉం ది. కిలో పచ్చిమిర్చి రూ.120 కి పైగా ధర పలుకుతోంది. ఇవి హౌల్ సేల్ మార్కెట్ ధరలు కాగా రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ధర లు పెరగడంతో టమాటా, పచ్చిమిర్చిలను సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగానే పంట దిగుబడులు తగ్గి టమా టా, పచ్చి మిర్చి ధరలు మండిపోతున్నాయి. నైరుతి రుతు పవనాల ప్రభావం కారణంగా మామూలుగా జూన్ ఆరం భంలో వర్షాలు కురిసేవి. అయితే ఈసారి నైరుతి రుతు పవనాల రాక ఆలస్యం కారణంగా పంటల దిగుబడి తగ్గిం దని రైతులు చెబుతున్నారు. రాష్ట్రాల్లో టమాటా, పచ్చి మిర్చి కొంతమేర సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉత్త రాదిలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. వాగులు వం కలు పొంగిపొర్లుతుండటంతో రవాణా వ్యవస్థ కూడా స్తం భించింది. ఈ కారణాల వల్ల కూడా టమాటా, పచ్చిమిర్చి తో పాటు ఇతర కూరగాయల ధరలు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లలోకి తాజా పంట వస్తేనే ధరల మంట నుంచి ఉపశమనం కలుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
”కూరగాయలు.. కొనలేం”
బహిరంగ మార్కెట్లలో కూరగాయలను ముట్టుకుంటే మంట మండుతోంది. నిన్నమొన్నటి వరకు ఎండాకాలం కావడం, శుభకార్యాలు ఉండటంతో డిమాండ్ పెరిగి కూర గాయల ధరలు కొండెక్కాయి. రైతు దగ్గర పంట లేదు. ఎండాకాలం పంట పండదు. ఇదే అదునుగా కూరగాయల వ్యాపారులు ధరలు పెంచి నిలువు దోపిడీ చేస్తున్నారు. సా మాన్యుడి వంటగదిలో కూరలు ఉడకకుండానే కుతకుత మంటున్నాయి. టమోటా ఎప్పుడూ కిలో రూ.15 నుంచి 20లకు లభ్యమయ్యేవి. అలాంటి టమోటా ఇప్పుడు కిలో రూ.90 నుంచి రూ.100లకు చేరింది. దీంతో వినియోగ దారుడిపై 2,3 రెట్ల ధరల భారం పడింది. మార్కెట్లో ట మోటానే కాకుండా ప్రతి కూరగాయ ధరలు ఆకాశాన్నం టాయి. సాధారణ రోజుల్లో కిలో రూ.20ల లోపు లభించే కూరగాయలు ప్రస్తుతం కిలో రూ.50ల నుంచి 80లకు, గతంలో రూ.10లకు 3 ఆకుకూరల కట్టలు లభించేవి ఇప్పుడు రూ.20లకు 3 కట్టలే ఇస్తున్నారు. సామాన్యుడు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తుతున్నాడు. డిమాం డ్‌కు సరిపడా లోకల్ కూరగాయల నిల్వలు లేక ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాలనుంచే కాకుండా రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో రవాణా చార్జీల భారం సైతం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.
కూరగాయల ధరలతో సామాన్యుడు విలవిల
12:49 am