
మేడారం సమ్మక్క- సారలమ్మ, వనదేవతల మహా జాతరకు పడిగాపూర్, ఎల్బాక గ్రామాలకు చెందిన సమ్మక్క వనదేవత (తమ్ముడు) సోదరుడు వనం పోతురాజు పూజారులు వనం పోతురాజు అడవిలో గుట్ట పై నుండి గద్దెల వద్దకు రావడానికి రహదారిని ముండ్ల చెట్లను తొలగించి లైన్ క్లియర్ గా సొంత ఖర్చులతోనే గ్రామస్తులు మరమ్మతులు చేస్తున్నారు. మేడారం మహా జాతర సందర్భంగా బుధవారం నాడు సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలు గద్దెపైకి చేరుతారు. గురువారం ఉదయం సమ్మక్క సోదరుడు వనం పోతురాజు గద్దెలపై చేరిన అనంతరం సాయంత్ర సమ్మక్క చిలకలగుట్ట నుండి గద్దెలపైకి వస్తారు. ప్రతి సంవత్సరం ఆదివాసి సాంప్రదాయాల ప్రకారంగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కానీ మహా జాతరలో వనం పోతురాజు వనదేవతకు సరైన గుర్తింపు లేదని వనం పోతురాజు పూజారులు అధికారులకు, పూజార్ల సంఘానికి విన్నవించుకుంటున్నారు. ఈసారి జాతరకైనా గద్దెల ప్రాంగణంలో వనం పోతురాజు వన దేవతకు సరైన గుర్తింపు ఇచ్చి, గద్దెల ప్రాంగణంలో వనం పోతురాజు హుండీలను కూడా ఏర్పాటు చేయాలని, సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతల పూజారులకు ఇచ్చే సౌకర్యాలు సదుపాయాలన్నీ వనం పోతురాజు పూజారులు కూడా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వనం పోతురాజు పూజారులు, ఆదివాసి మహిళలు, యువకులు, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు.