డిగ్రీ కళాశాలను పరీశీలించిన ప్రిన్సిపాల్

Principal inspecting Degree Collegeనవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ప్రభుత్వం డీగ్రీ కళాశాల ను ఇంచార్జి ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య శుక్రవారం పరిశీలించారు‌. నూతనంగా డీగ్రీ కళాశాల మంజూరు కావటంతో కళాశాల ప్రారంభానికి  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భవనం ను ఆధీనంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడారు .కళాశాల ప్రారంభానికి సంబంధించి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, డా. భీమ్ రావ్, గుంత సుధాకర్, డా. ఓం ప్రకాష్ , బిడిసి అధ్యక్షుడు గుంజల నారాయణ, నాయకులు రోల్ల రమెష్,పతంగి కిషన్ , సంజీవ్, గంగాధర్, శంకర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.