నవతెలంగాణ – అశ్వారావుపేట : జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,అశ్వారావుపేట సముదాయ పరిధిలోని నందమూరి నగర్,అల్లూరి సీతారామరాజు నగర్, బి.సి కాలనీ లోని పాఠశాలలను శుక్రవారం కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధుల ప్రగతిని,హాజరు రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా విద్యార్ధుల హాజరు ను 10 గంటల కల్లా పూర్తి చేయాలని మధ్యాహ్నం భోజనం హాజరు ను కూడా యం.డి.యం. యాప్ లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులు కు సూచించారు.విద్యార్ధుల ప్రగతిని మెరుగుపర్చేందుకు ఇప్పటినుండే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వర్క్ బుక్ లను వినియోగించి విద్యార్ధులు చే వ్రాయించాలని తప్పులను సరి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె తో పాటు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు సందర్శనలో పాల్గొన్నారు.